south-africa-vs-west-indies-one-more-thrilling-matchనాగ్ పూర్ వేదికగా దక్షిణాఫ్రికా – వెస్టీండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గ్రూప్ 1 విభాగంలో కొంత స్పష్టతను ఇచ్చింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలోనూ మూడింటిని నెగ్గిన విండీస్ సెమీస్ కు చేరింది. దీంతో గ్రూప్ 2లో ఇప్పటికే సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకున్న కివీస్ జట్టు సరసన నిలిచింది విండీస్.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు సఫారీలను కేవలం 122 పరుగులకు నియత్రించడంలో సక్సెస్ అయ్యింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో మొదటి ఓవర్లో 1వ పరుగు వద్ద నేలకూలిన మొదటి వికెట్… చివరి ఓవర్లో 122 పరుగుల వద్ద 8వ వికెట్ పడడంతో ముగిసింది. బౌలింగ్ కు తోడు ఫీల్డింగ్ లో కూడా మెరుగైన ప్రదర్శనను ఇవ్వడంతో మొదటి, చివరి వికెట్లు రనౌట్ల రూపంలో లభించాయి.

ఇక, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు కూడా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో విజయానికి కావలసిన రన్ రేట్ ను కూడా మైంటైన్ చేయడంతో… చివర్లో కాస్త తడబాటుకు గురైనప్పటికీ, థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకోగలిగింది. ఇమ్రాన్ తాహీర్ వరుసగా రెండు వికెట్లు నేలకూల్చడంతో కంగారు పడ్డ కరేబియన్లను చివరి ఓవర్లో బ్రెత్ వైట్ ఒక సిక్సర్ బాది సక్సెస్ ను ఖరారు చేసాడు.

ఈ ఉత్కంఠ రేపిన మ్యాచ్ తో గ్రూప్ 1 విభాగంలో మరో బెర్త్ కోసం శ్రీలంక, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఏదైనా అధ్బుతం జరిగితే తప్ప సఫారీలు సెమీస్ లో అడుగు పెట్టే అవకాశం లేదని క్రీడా విశ్లేషకులు తేల్చేస్తున్నారు. దీంతో ‘వరల్డ్ కప్’ సెంటిమెంట్ ఇంకా దక్షిణాఫ్రికాను వెన్నాడుతోందన్న వాదనలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.