sounds-from-jayalalithaa-grave-at-chennai-marina-beachప్రత్యక్ష దైవంగా కొలిచే తమిళ ప్రజలు ఆరాధించే జయలలితను చెన్నైలోని మెరీనా బీచ్ లో సమాధి చేసిన విషయం తెలిసిందే. చివరి సారిగా ‘అమ్మ’ను చూడలేని వారు మరియు ‘అమ్మ’నే తలచుకుంటూ కృంగిపోతున్న వారు బీచ్ లోని సమాధి వద్దకు వచ్చి శ్రద్దాంజలి ఘటిస్తుండగా… వారికి ఒక రకమైన ‘శబ్దం’ వినపడుతోంది. ముఖ్యంగా అమ్మ పాదాల వద్ద శిరస్సు వచ్చి సాష్టంగా ప్రణామం చేస్తున్న వారికి ఈ శబ్దం స్పష్టంగా వినపడుతుండడంతో… ఈ విషయం ఈ నోట ఆ నోట పాకిపోవడంతో… ‘అమ్మ’ సమాధి వద్దకు జనం తండోపతండాలుగా పోతెత్తుతున్నారు.

సామాన్య ప్రజలకు అర్ధం కాని ఈ శబ్దాన్ని ఓ మహిమగా చూస్తున్న ప్రజలు కొందరైతే… మరికొందరు అది అమ్మ గుండె శబ్ధమేనని అంటున్నారు. జనాల టాక్ ఇలా ఉంటే… ఇంతకీ ఆ శబ్దం రావడానికి అసలు కారణం మాత్రం వేరే ఉంది. అమ్మ పార్థీవదేహంతో పాటు ఆమె చేతి వాచ్ ని కూడా ఖననం చేసిన విషయం తెలిసిందే. ఈ వాచ్ నుండి వస్తున్న ‘టిక్ టిక్’ శబ్దమే అమ్మ ప్రజలకు వినిపిస్తోందన్నది అసలు విషయం. అయితే ‘దైవం మానుష్య రూపేణా’ అన్న చందంగా… జయలలితను దైవంగా భావించే ప్రజలకు మాత్రం… అదొక దైవ సమానత్వమైన మహిమే!

గతంలో ఏంజీఆర్ మరణించిన సందర్భంలో కూడా ఆయనతో పాటే వాచ్ ను కూడా ఖననం చేయగా, తాజాగా జయలలిత విషయంలోనూ అదే జరిగింది. ‘టిక్ టిక్’ అనే వాచ్ శబ్దం కాస్త అమ్మ ‘హార్ట్ బీట్’గా మారిపోయింది. దైవమో, దెయ్యమో అన్న విషయం పక్కన పెడితే… “కారణజన్మం” అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా జయలలితను చూపించడంలో మాత్రం అతిశయోక్తి లేదు.