Sonu Sood - YS Jaganసంక్షేమ కార్యక్రమాల హడావిడిలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఒక ఏడాదికి చెయ్యదలచుకున్న అప్పులో రాష్ట్ర ప్రభుత్వం 68% తొలి మూడు నెలలలో చేసేసింది అంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ లెక్కలను బట్టి ఆంధ్ర ప్రదేశ్ లో గత 15 నెలల్లో గంటకు 9 కోట్లు, నిమిషానికి 15 లక్షలు అప్పు చేసిందంటే దారుణం అనే చెప్పుకోవాలి.

పైగా అప్పు చేసిందంతా పప్పు బెల్లాలుగా పంపీణీకే సరిపెట్టడం బాధాకరం. మీడియా కూడా గత మూడు నాలుగు రోజులుగా ఈ విషయంగా వార్తలు వెయ్యడంతో సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం అప్పుల తీట గురించి సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి.

“అప్పుల కోసం ప్రత్యేక ఆర్డినెన్సు తెస్తుందంట ప్రభుత్వం.. ఈ లెక్కన ఎక్కడ అప్పు దొరుకుతుందా అనే చూస్తున్నట్టుగా ఉంది. అప్పు దొరుకుద్ది అంటే సోనూ సూద్ సహయం కోరినా కోరతారు.. అప్పులు కోసం అంత ఆత్రంగా ఉన్నారు,” ఆంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… ఈ మతిలేని అప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తలకు 20,000 అప్పు కేవలం ఈ 15 నెలలోనే పెరిగిందట. టాక్సులు, ఛార్జీల పెంపు వగైరా రూపంలో ఈ సొమ్ము అంతా ఆ తరువాత పబ్లిక్ కట్టాల్సిందే అని తెలియని జనం మనకేం నష్టం అనుకుంటూ కాలం గడిపేస్తున్నారు.