Sonu Sood tractor donation to andhra pradesh farmerఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యులతో దుక్కిదున్నిస్తూ వీడియో వైరల్ కావడంతో నటుడు సోనూసూద్ వెంటనే స్పందించి 24 గంటలలోగా ఆ రైతుకు ఒక కొత్త ట్రాక్టర్ ఇప్పించాడు. ఆ తరువాత వెంటనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆ రైతు ఇద్దరి కుమార్తెల చదువు బాధ్యత తాము తీసుకుంటాం అని ప్రకటించారు.

దీనితో చంద్రబాబుకు సోషల్ మీడియా నుండి జాతీయ మీడియాలో కూడా మంచి పేరు రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అలెర్ట్ అయ్యింది. అసలు ఆ కుటుంబం సాయానికి అర్హం కాదంటూ సోషల్ మీడియా లో ఒక కాంపెయిన్ నడిపింది. ఆ కుటుంబం అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుగా ఉందని, సెలవులకు సొంత ఊరు వచ్చి సరదాగా దుక్కిదున్నుతున్నట్టు వీడియో తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు.

సదరు రైతు నాగేశ్వరరావు గతంలో ఒకసారి లోక్ సత్తా తరపున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారని వారు అంటున్నారు. అయితే దీనిని నాగేశ్వరరవు కుటుంబం ఖండించింది. “మేము ఎస్సి కులానికి చెందిన వారం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు సంక్రమించిన 1.87 సెంట్ల భూమిని సాగుచేసుకుంటున్నాం. మదనపల్లిలో ఒక టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాం. అయితే లాక్ డౌన్ కారణంగా అది మూతపడటంతో గ్రామానికి వచ్చేశాం,” అని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.

లోక్ సత్తా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి డబ్బు ఉన్నవాడు అయ్యుండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అలాగే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుడు అంటే పేద వాడే అయ్యుండాలి. “కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే ప్రభుత్వం ఒక సామాన్య రైతు కుటుంబాన్ని హింసిస్తుంది. ఒక సన్నకారు రైతుకు దొంగ, మోసకారి అనే ముద్ర వెయ్యాలని ప్రయత్నం చేస్తుంది,” అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.