Sonu sood -in balakrishna movieసోను సూద్ సినిమాలలో విలన్, కామెడీ విలన్ పాత్రలతోనే అందరికీ తెలిసిన ఈ పేరు… లాక్ డౌన్ తరువాత దేశమంతా మారుమోగిపోతుంది. కష్టాల్లో ఉన్నవారిని ప్రభుత్వాలు ఆదుకోకపోయినా ఒక ట్వీట్ చేస్తే చాలు సోను టీం అక్కడ వాలిపోయి సాయం అందించి అందరి మనసులు గెలుచుకున్నాడు సోను.

ఆయన ప్రస్తుతం తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మరో తెలుగు సినిమా సైన్ చేసినట్టు సమాచారం. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో సోను సూద్‌ను విలన్‌గా మేకర్స్ ఖరారు చేసినట్లు సమాచారం.

ఈ సినిమా మేకర్స్ మొదట్లో ఈ పాత్ర కోసం సంజయ్ దత్ ను కోరుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన అనారోగ్యం కారణంగా అది సాధ్యం కాదు. కాబట్టి, వారు సోను సూద్ కోసం ఎంచుకున్నారు. సోను సూద్ కు ప్రస్తుతం ఉన్న పాపులారిటీ చిత్రానికి కూడా హైప్ తెస్తుంది. కాబట్టి అన్ని రకాల ఇది మంచి నిర్ణయమే అని చెప్పుకోవాలి.

మిరియాల రవీందర్ రెడ్డి తన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. జూన్‌లో విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ టీజర్ ఈ చిత్రంపై హైప్ మరియు అంచనాలను భారీగా పెంచేసింది.