sonal-chauhanనందమూరి బాలకృష్ణ సినిమా అంటే డైలాగ్ లు, ఫైట్లు తో పాటు గ్లామర్ డోస్ కూడా కొంచెం ఎక్కువే వుంటుంది. ‘లెజెండ్’ సినిమా ఫస్ట్ హాఫ్ లో కురచ దుస్తులతో కుర్రకారుని కనువిందు చేసిన సోనాల్ చౌహాన్, బాలయ్య 99 వ చిత్రం ‘డిక్టేటర్’ లో రెండో సారి ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో సోనాల్ తన అందాలను దాచుకోకుండా మరింత కురచ దుస్తులు దరించటం తో పాటు, టూ పీస్ బికినీలో కూడా తడి తడి అందాలతో తపనలు రేపనున్నట్లు సమాచారం. ఈ సారి సోనాల్ ఏ తీరిలో అందాలూ అరబోసిందో, అవి ఎంత వరకు ప్రేక్షకులని ఆకర్షిస్తాయో చూడాలి. ఈ సినిమా లో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ తో పాటు అంజలి మరియు అక్ష నటిస్తున్నారు.

‘డిక్టేటర్’ చిత్రాన్ని శ్రీవాస్ దర్శకత్వం వహిస్తుండగా ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటివలే ఈ సినిమా ఆడియో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో గణంగా విడుదలయ్యింది.