somuveerraju-to-make-bjp-as-ysrcp-bteamఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన నాటి నుండీ ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా.. అమరావతి – మూడు రాజధానుల విషయంలో రెండు బోట్ల మీద సవారి చేస్తున్న బీజేపీ స్పష్టంగా ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిని సమర్థిస్తూ ముందుకు వెళ్తుంది. పార్టీలో అమరావతి అనుకూల గళాలను అణచివేస్తున్నారు.

మూడు రాజధానుల మీద టీవీ చర్చలలో గట్టిగా మాట్లాడిన ఇద్దరు పార్టీ నాయకులను వీర్రాజు ఇప్పటికే సస్పెండ్ చేశారు. “వీర్రాజు సొంతంగా తీసుకున్న నిర్ణయమో లేక పార్టీ హై కమాండ్ చెప్పిందో గానీ ఆయన జగన్ పార్టీ అనుకూలమైన లైన్ తీసుకున్నారు. దానికి భిన్నంగా మాట్లాడితే వదిలేది లేదు అన్నట్టు కూడా సంకేతం ఇస్తున్నారు,” అని పార్టీలోని కొందరు అంటున్నారు.

“ఇప్పటివరకు అమరావతికి అనుకూలంగా ఉన్న హిందూ మహాసభను కూడా కించపరుస్తున్నారు. దానితో సంఘ్ పరివార్ కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉంది. మొత్తానికి వీర్రాజు బీజేపీని వైఎస్సార్ కాంగ్రెస్ బీ-టీం చేసేదాకా వదిలేలా లేరు,” అంటూ వారు విమర్శిస్తున్నారు.

బీజేపీకి కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయేది ఏమీ ఉండదు. అయితే బీజేపీని నమ్మి పొత్తుపెట్టుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మాత్రం ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అమరావతి రాజధానిగా కొనసాగించడం కోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నా అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈ తాజా వైఖరికి సమాధానం చెప్పుకోలేనట్టుగా ఉంది.