Pawan Kalyan - JanaSenaనిన్న తిరుపతిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని, జనసేన బలపరచిన బీజేపీ అభ్యర్ధికి ఓట్లు వెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ ఏకపక్ష ప్రకటన జనసేన వర్గాలను, జనసైనికులు షాక్ కు గురి చేసింది.

గతంలో పవన్ ఢిల్లీ వెళ్లి ఈ విషయంగా చర్చించి… ఒక జాయింట్ కమిటీ వేసి ఎవరు పోటీ చెయ్యాలి అనేది నిర్ణయిస్తాం అన్నారు. అయితే అటువంటి కమిటీ ఏదీ వెయ్యకముందే బీజేపీ నిర్ణయం తీసేసుకుని ప్రకటించేసింది. కనీసం ఉమ్మడి సమావేశంలో కూడా ప్రకటన చెయ్యకపోవడం దారుణం అని జనసైనికులు అంటున్నారు.

పవనన్నా… ఎన్నాళ్లు ఇలా అవమానాలు భరిస్తాం? అంటూ ఆక్రోశం చెందుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చెయ్యడానికి కొన్ని రోజుల ముందు బీజేపీ నాయకులు జనసేనాని తో ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ పోటీ చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడానికి ఉండి ఉండవచ్చు.

అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం దీనిని బీజేపీ ఏకపక్ష నిర్ణయంగానే చూస్తున్నారు. తమను కలుపుకుని వెళ్లడంలో బీజేపీ వ్యవహార శైలి బాలేదని, తమ పార్టీని తక్కువ చేసి చూస్తున్నారని వారి భావన. అయితే ఈ విషయంలో ఏ పార్టీలో నైనా కార్యకర్తల అభిప్రాయాలతో పెద్దగా ప్రాధాన్యత ఉండదు… అధినేత ఏమనుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్.