Somu Veerrajuరాష్ట్ర బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కాకుండా ఉంది. వారు చేస్తున్న ఆరోపణలకు చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన అనేది లేదు. రాష్ట్రానికి ఇప్పటివరకు రెండు లక్షల కోట్లు ఇచ్చాము అని చెబుతూ తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.16వేల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులను ఏం చేశారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

అప్పుడూ ఇప్పుడూ మాట్లాడుతుంది ఆయనే. పైగా రాష్ట్ర విభజన చట్టం అమలుకు 2022 వరకు సమయం ఉందని, ఇప్పటి నుంచే ఉద్యమం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో 60 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. మిగతావి 2022 లోగా పూర్తి చేస్తాం అని చెప్పుకొచ్చారు ఆయన.

ఇలాంటి వితండవాదన చేస్తే ప్రజలు కొట్టినా కొడతారు కూడా. వెనుకబడిన జిల్లాలకి 1050 కోట్లు పారిశ్రామిక రాయితీ కేటాయించామని, అయితే వాటిని ఒక్క పరిశ్రమకైనా ఆ నిధులు కేటాయించారా అని ప్రశ్నించారు. నిజానికి ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమ కూడా ఆ రాయితీకి అప్లై చేసుకోలేదు. దీనిబట్టి అది ఎంత గొప్ప రాయితీ అనేది అందరికి అర్ధం అవుతుంది.

ఇలాంటి వితండవాదన చేస్తూ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందని టీడీపీకి భయం పట్టుకుందని ఆయన ఆరోపించడం హాస్యాస్పదం కాదా? అసలు ఇలాంటి వాదన చేస్తే బీజేపీకి పడే నాలుగు ఓట్లు కూడా ఈసారి అనుమానమే కదా. ఇంకా ఎదగడం లాంటి మాటలు పూర్తిగా అసందర్భం కదా? సోము వీర్రాజు లాంటి వారు పెట్టే ప్రతి ప్రెస్ మీటు వల్ల బీజేపీకి నష్టమే.