Somu Veerraju - Chandrababu -Naiduతెలుగుదేశం ప్రభుత్వంపై తాను సిబిఐకి పిర్యాదు చేస్తానని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. చెట్టు-నీరు పదకం కింద పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. వందల కోట్ల కేంద్ర నిదులను దుర్వినియోగం చేశారని, తెలుగుదేశం నేతలు భోంచేశారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ గృహాలు, నీరు-చెట్టు పథకం వంటి వాటిలో 13 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. మట్టి అక్రమంగా అమ్మి రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టించారన్నారు. నిజంగా సోము వీర్రాజు ప్రాధమిక ఆరోపిణలు చూపించగలిగి సీబీఐకి ఫిర్యాదు చెయ్యగలిగితే అది హర్షించదగిన విషయమే. కాకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోపణలకు మాత్రమే పరిమితమయ్యారు.

ఇప్పటికే కర్ణాటక ఎన్నికల తరువాత తెలుగు దేశం పార్టీకి చుక్కలు చూపిస్తాం అని ఆ పార్టీ నేతలు అనేక మంది వార్నింగ్ ఇచ్చారు. అయితే అటువంటి చేష్టలకు ఏమైనా పాల్పడితే చంద్రబాబు మీద సింపతీ పెరిగి మొదటికే మోసం వస్తుందా అని బీజేపీ పెద్దలు భయపడుతున్నట్టు సమాచారం.