Somu Veerraju - Visakhapatnam Steel privatisationబీజేపీ నేతల చేష్టలు… చెప్పే మాటలు చాలా చిత్రంగా ఉంటాయి. ప్రత్యేక హోదా విషయంలోనూ, ఆ తరువాత అమరావతి విషయంలోనూ వారి రెండు నాలుకల ధోరణి అందరికీ తెలిసిందే. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చెయ్యనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

ఆ తరువాత దానిని కేంద్ర కాబినెట్ కూడా ఒకే చేసింది. అయితే ఈ కారణంగా ఉత్తరాంధ్ర లో వ్యతిరేకత ఎదురవుతుందని ఊహించి బీజేపీ కొత్త నాటకానికి తెరలేపింది. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చెయ్యడంలో కేంద్రంపై బీజేపీ కూడా పోరాడతాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. సోము వీర్రాజు ప్రకటనతో అంతా ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతు అయ్యింది.

మరోవైపు… ఉన్నఫళంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి ఆ ప్రక్రియ ని ఆపాల్సింది గా కోరారు. ఆయనతో పాటు కేంద్ర హోమ్ శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్ కూడా ఉన్నారు. అయితే ప్రైవేటు పరం చేస్తుంది ఎవరు పోరాడుతున్నాం అని చెప్పుకుంటుంది ఎవరు?

ఇది ఇలా ఉండగా… ఈ వ్యవహారంపై కార్మిక సంఘాలు భగ్గమున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణపై నిరసనలు ఊపందుకున్నాయి. శుక్రవారం జీవీఎంసీ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక ఎన్‌ఏడీ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు బైక్ ర్యాలీ సాగింది. నిరసనల్లో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి.