Somu -Veerraju to meet Mudragada Padmanabhamకొత్తగా నియమితులైన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన పదవీకాలాన్ని ఉత్సాహంగా మొదలు పెట్టారు. పార్టీ దశదిశలు మారుస్తానని ప్రకటించి అందుకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. మొన్న హైదరాబాద్ వెళ్లి మెగాస్టార్ చిరంజీవి ని కలిసొచ్చారు. ఆ తరువాత తమ పార్టనర్ పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు. కాపు ఓటర్ల టార్గెట్ గా ఆయన పని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

మరోవైపు ఆయన త్వరలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను కూడా కలిసి వారిని తమ పార్టీలో ఆహ్వానించనున్నట్టు సమాచారం. ముద్రగడ ఇటీవలే తాను కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇక జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికలలో జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే గాజువాకలో పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యేకు పడిన ఓట్ల కంటే లక్ష్మీనారాయణకు ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం. కానీ ఆ తరువాత పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు.

ఇప్పటిదాకా ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన బీజేపీలో చేరితే మాత్రం పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది పడటం ఖాయం. ముద్రగడ చేరితే పెద్దగా ఉపయోగం లేకపోయినా జేడీ లక్ష్మీనారాయణ చేరితే మాత్రం కొంత గుడ్ విల్ వస్తుంది. చూడాలి మునుముందు ఏం జరుగుతుందో!