Somu Veerraju - Tirupati Bypollఆరు నెలలుగా బీజేపీ తిరుపతిలో నానా హడావిడి చేసింది. కార్యకర్తల సమావేశం… ఆ సమావేశం ఈ సమావేశం అంటూ ఆ పార్టీ రాష్ట్ర నేతలు అంతా తిరుపతికి తరచు వెళ్లి హడావిడి చేశారు. జనసేన సీటు కావాలన్నా పట్టుబట్టి తామే పోటీ చేస్తామని ఒప్పించారు. మీకంటే మేమే బాగా ప్రిపరెడ్ గా ఉన్నాం… మేమైతేనే తిరుపతిలో గట్టి పోటీ ఇస్తాం అని జనసేనను బుల్డోజ్ చేశారు.

తీరా తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాకా సైలెంట్ అయిపోయింది బీజేపీ. టీడీపీ అందరికంటే ముందుగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నెల 24న ఆమె నామినేషన్ వెయ్యబోతున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గురుమూర్తి అనే ఫీజియోథెరపిస్ట్ బరిలో నిలిచారు. అయితే బీజేపీ మాత్రం ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఏదో మిరాకిల్ జరిగి తాము రెండో స్థానంలోకి రావాలని నాయకులకు ఉన్నా ఆ పార్టీకి అంత సీన్ లేదని ఇప్పటికే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ప్రచారానికి రాబోరని కూడా వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే బీజేపీకి మరిన్ని కష్టాలు తప్పవు అనే చెప్పుకోవాలి.

ఏప్రిల్ 17న తిరుపతిలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 30న నామినేషన్లకు చివరి రోజు కాగా మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మునిసిపల్ ఎన్నికలలో వచ్చిన సెన్సషనల్ ఫలితాల కారణంగా తమ గెలుపు నల్లేరుపై బండినడకే అని వైఎస్సార్ కాంగ్రెస్ అనుకుంటుంది.