Somu Veerraju suspends dinakrఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుండీ సస్పెన్షన్ల పర్వంలో బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసి ఈ మధ్య బీజేపీలోకి వచ్చిన వారిని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ సస్పెన్షన్‌ వేటు వేశారు.

పార్టీ నియమాలకు విరుద్ధంగా, సొంత అజెండాతో టీవీ చర్చల్లో పాల్గొంటున్నారన్న కారణంగా వేటు వేశారు. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వనందును పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు.

గతంలో ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. ఇదే కారణంగా ఇప్పటికే బీజేపీ నుండి ఇద్దరు ముగ్గురుని సస్పెండ్ చేశారు. “వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే వీర్రాజు తెలుగుదేశం పార్టీ అన్నా… ఆ పార్టీ నేతలన్నా ఒంటి కాలి మీద లేస్తారు. ఎందుకనో ఆ పార్టీ నుండి బీజేపీలోకి వచ్చినా ఆయనకు వారి మీద నమ్మకం కుదరదు,” అని బీజేపీలోని ఒకరు చెప్పుకొచ్చారు.

“వీర్రాజు మాట్లాడినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూల లైన్ లో మాట్లాడని వారందరని సస్పెండ్ చెయ్యడం చేస్తారు,” అని అన్నారు. “ఒకరకంగా ఇది టీడీపీకి మంచి పరిణామమే. బీజేపీకి వెళ్ళాలి అనుకునే నాయకులు ఇక నుండి ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఆ విధంగా సోము వీర్రాజు అనుకోకుండా టీడీపీకి మంచి చేసినట్టే,” అని ఒక విశ్లేషకుడు అనడం విశేషం.