Somu Veerrajuఒకపక్క టీడీపీ బీజేపీ మరోసారి పొత్తు కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం టీడీపీపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబుకు అవినీతి మకిలి అంటించాలని చూస్తున్నారు. తనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అవనివ్వకుండా చంద్రబాబు అడ్డు పడ్డారని ఆయన అక్కసు.

బీజేపీకి పొత్తుపై నిజంగా నిబద్ధత ఉంటే ఇప్పటికే వీర్రాజుని కంట్రోల్ చెయ్యాలి. కంట్రోల్ చెయ్యలేకపోతే ఆయనను పార్టీనుండి తప్పించాలి. అమిత్ షా నే అవినీతి ఎక్కడ ఉన్నా పోరాడమని చెప్పారని వీర్రాజు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా పార్టీనే ఆయనతో అలా మాట్లాడిస్తుందా?

అలా మాట్లాడించడం అంటే టీడీపీతో పొత్తుపై బీజేపీకి ఇంట్రెస్ట్ లేనట్టేగా? మరి ఎందుకు కేంద్రమంత్రులందరు సమస్యలు పరిష్కరించుకుంటాం, 2019లో కలిసే పోటీ చేస్తాం అని చెపుతున్నారు. ఏంటి ఈ డ్రామా? టీడీపీని పొమ్మనలేక పొగబెడుతున్నారా? జగన్ తో ఏమన్నా ముందస్తు ఒప్పందం చేసుకున్నారా?