Somu Veerraju says tdp to merge into bjp in andhra pradeshకొన్ని రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరతారు అనే ఊహాగానాలకు తెరలేపారు. అయితే ఆయన బీజేపీలో ఉండబోతున్నా అంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటిలానే ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద విరుచుకుపడ్డారు.

త్వరలో చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తారని, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమను కలిశారని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మరన్నారు. ఆ 23 మందిని కలుపుకుంటామన్నారు. ఈ శాసనసభలో తమ ప్రాతినిధ్యం ఉండడం ఖాయమన్నారు. త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.

అయితే ఈ మాటకు టీడీపీ అభిమానులు ఘాటుగానే స్పందిస్తున్నారు. “సిగ్గు ఉందా వీర్రాజు గారు? ప్రజల మన్ననలు పొంది అసెంబ్లీలో ప్రాతినిధ్యం తెచ్చుకోలేక ఫిరాయింపులతో తెచ్చుకుంటారా? అధిష్టానం సీటు ఇస్తా అన్నా గెలవలేను అని పోటీ చెయ్యని మీరు కూడా మాట్లాడుతున్నారా, అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా టీడీపీ తరపున గెలిచిన 23 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారట. ఆ 23 మందిలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్టు మర్చిపోయారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే జరిగిన ఎన్నికలలో బీజేపీ కనీసం ఒక్క సీటులో కూడా డిపాజిట్ తెచ్చుకోని విషయం తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సహా సీనియర్ నేతలందరికీ డిపాజిట్ దక్కలేదు. ఆ పార్టీకి నోటా కంటే తక్కువగా కేవలం 0.89% ఓట్లు లభించాయి.