Somu Veerraju - Pawan Kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీకి తిరుపతిలో పోటీచేసే అవకాశం ఇవ్వాలంటూ డిల్లీ వెళ్లారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వెళ్లి మూడు రోజులైనా ఆయనకు ఇప్పటిదాకా బీజేపీ పెద్దలు అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీనితో జనసైనికులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

మరోవైపు.. అయితే ప్రధాని మోడీ తిరుపతి ని స్మార్ట్ సిటీగా చేసారని, గతంలో తిరుపతిలో బీజేపీ నెగ్గిందని దానితో అక్కడ నుండి బీజేపీనే పోటీ చేస్తుందని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహ రావు ప్రకటించారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ సీటు కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి అనేది అర్ధం కావడం లేదని అంటున్నారు.

“తెలంగాణ బీజేపీ దుబ్బాకలో గెలవడం వేరు ఏపీ బీజేపీ తిరుపతిలో గెలవడం అనేది తేలిక కాదు. ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో అధికార పార్టీ బలంగా ఉంది. అలాగే ఉపఎన్నికలో అధికార పార్టీకి సహజంగానే బలం ఉంటుంది. జనసేన పోటీ చేసినా ఓటమి ఖాయమే. మరి ఎందుకు వీరు సీటు కోసం కొట్టుకుంటున్నారు?,” అని వారు ఆశ్చర్యపడుతున్నారు.

బీజేపీ నిజంగా తాను బలపడినట్టు భావిస్తుంది. అది చూపించుకోవాలనే ఆతృతతో వారు పోటీ చెయ్యాలని అనుకుంటున్నారు. తాము పోటీ చెయ్యకపోతే ప్రజలు తమను మర్చిపోతారని జనసేన భయపడుతుంది. అందుకే రెండు పార్టీలు తిరుపతి సీటు కోసం పోటీ పడుతున్నారు. చూడాలి మొత్తానికి ఏం జరుగుతుందో!