Somu -Veerraju - Pawan- Kalyan2014 ఎన్నికలయిన కొన్ని నెలలకు టీడీపీతో పొత్తు విఫలం కావడానికి కొంతమంది రాష్ట్రబీజేపీ నాయకులు కీలక పాత్ర పోషించారు వారిలో సోము వీర్రాజు ఒకరు. టీడీపీ వల్ల ఎమ్మెల్సీ అయ్యి కూడా తమ సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేసేవారు. చాలా మంది ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకున్నారంటే అతిశయోక్తి కాదు.

2014 ఎన్నికల ముందు సోము వీర్రాజు మొట్టమొదటి సారిగా పవన్ కళ్యాణ్ ను గుజరాత్ తీసుకుని వెళ్లి నరేంద్ర మోడీకి పరిచయం చేశారు. ఆ తరువాత టీడీపీ, బీజేపీ జతకలవడం, వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చెయ్యడం చకచకా జరిగిపోయాయి. అయితే తాజాగా జరిగిన జనసేన బీజేపీ చర్చల మీటింగ్ కు సోము వీర్రాజు హాజరు కాకపోవడం విశేషం.

2019 ఎన్నికలలో బీజేపీ రాష్ట్ర నాయకులందరూ పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అయితే సోము వీర్రాజు మాత్రం నాకు ఇంకా ఎమ్మెల్సీ పదవీకాలం ఉందని వంకతో పోటీ చెయ్యలేదు. వీర్రాజు చాలా ప్రాక్టికల్ మనిషి అని పోటీ చేస్తే ఏం జరుగుతుందో ముందే ఊహించే పోటీ చెయ్యలేదని ఆయన సన్నిహితులు అనేవారు

తాజాగా జనసేన, బీజేపీల పొత్తు విషయంలో కూడా ఆయనకు నమ్మకం లేదని, దీనితో దూరంగా ఉన్నారని ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తూర్పు గోదావరి జిల్లాలో టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమన్నా గతంలో ఉన్న సాన్నిహిత్యంతో పిలిచి మాట్లాడతారేమో చూడాలి.