Somu Veerrajuబీజేపీ ఏదైనా రాష్ట్రంలో గెలిచినప్పుడు గర్జించే సోము వీర్రాజు మాయం అయిపోయారు. రాజస్థాన్ ఉపఎన్నికలలో ఓటమి, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు చుక్కెదురైన సందర్భంగా వీర్రాజు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. బీజేపీ కష్టకాలంలో ఉంది రాష్ట్రంలో. సర్వత్రా ఆ పార్టీ మీద నిరసన వ్యక్తం అవుతుంది.

టీడీపీతో సహా అన్ని పార్టీలు బీజేపీని దోషిని చేస్తున్నాయి. అయితే సోము వీర్రాజు లాంటి వారు తమకు ఏమి సంబంధం లేదంటూ బయటకు రావడం మానేశారు. వీరిని నమ్మి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పాలని చూస్తుంది. ఇప్పటిదాకా ఎన్నికలలో పోటీ చేసి గెలవని ఈ నాయకులు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిపోయి, 2019లో ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తారంట.

ఇటువంటి వారి సలహాలు విని రాష్ట్రంలోని మిత్రపక్షంతో విరోధం పెట్టుకుంటుంది బీజేపీ. కనీసం ఇలాంటి నేతలకు ప్రజా మద్దత్తు ఉందేమో చూసుకుంటే బావుండేదేమో. టీడీపీ ఎన్డీఏ నుండి బయటకు రావాలని నిర్ణయించుకుంటే కాషాయ పార్టీ నెల రోజుల వ్యవధిలో రెండు అతిపెద్ద ఎన్డీఏ పక్షాల మద్దత్తు కోలుపోయినట్టు అవుతుంది.