Somu Veerraju -బీజేపీ తమతో పొత్తు వద్దనుకుంటే నమస్కారం పెట్టి తప్పుకుంటామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. మాతో కలసి ఉంటారో లేదో ఆయనే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రం లోని పలు పథకాలకు కేంద్రమే నిధులిస్తున్నా… ఎక్కడా ప్రధాని మోదీ ఫొటో ఉండట్లేదన్నారు.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని మేం మర్చిపోమని ఆయన పేర్కొన్నారు. మేం కూడా మిత్రధర్మమే పాటిస్తున్నామని, టీడీపీయే పాటించడం లేదన్నారు. చివరకు మంత్రి మాణిక్యాలరావుకూ సరైన ప్రాధాన్యం దక్కట్లేదని అన్నారు. బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని పురందేశ్వరి అన్నారు.

తమతో కలిసి ఉంటారో…ఉండరో…టీడీపీనే తేల్చుకోవాలని ఆవిడ అన్నారు. చంద్రబాబు ఘాటుగా స్పందించినా బీజేపీ నేతలు తగ్గకపోవడం, హైకమాండ్ వారిని నిలువరించే ప్రయత్నం చెయ్యకపోవడం చూస్తుంటే బీజేపీ-టీడీపీ మధ్య పొత్తుకు బీటలు పడ్డట్లేనా… అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.