Somu Veerraju complaints on andhra pradesh government2019 లో ఆంద్రప్రదేశ్ లో తామే హీరోలం అవుతామని బిజెపి ఎమ్మల్సీ ,ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల వరకు కేంద్రం నుంచి వస్తున్న నిధులతోనే పనులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తన ఖ్యాతిగా చెప్పుకుంటోందని ఆయన ఆరోపించారు. ఐతే దీనిలో కొంతవరకు నిజం లేకపోలేదు.

కేంద్రం నుండి రాష్ట్రాలకు నిధులు వస్తాయి ఐతే అవి రాష్ట్రాల నుండి వచ్చే పన్నుల నుండే అని వీర్రాజు కు తెలీదా? అలాగే రాష్ట్రం నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతి రూపాయి మళ్లీ రాష్ట్రానికి వస్తుందా లేక కొన్ని ప్రత్యేక రాష్ట్రాలకు మాత్రమే పోతుందా అనే దానిపై వీర్రాజు గాని మరొక బీజేపీ నాయకుడు గాని మాట్లాడగలడా?

రైల్వే వ్యవస్థ మొత్తం కేంద్రం చేతిలో ఉంది దాని ద్వారా వచ్చే లాభనష్టాలు కేంద్రనివే ఐతే అటువంటి వాటికి కూడా రాష్ట్రాల నుండి సగం పెట్టుబడి కేంద్రం పెట్టించడం లేదా? ఈ పెట్టుబడి వల్ల రాష్ట్రానికి ఆదాయంలో వాటా ఏమన్నా వస్తుందా? అంటే అదీ లేదు. సగం పెట్టుబడి పెడితేనే కొత్త ప్రాజెక్టులు లేకపోతే లేదు అనేది బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చాక పుస్తకాల్లో లేని రూల్. చివరికి లోటు రాష్ట్రమైన ఆంధ్రకు కూడా అదే రూల్.

పోలవరం ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల వరకు తీస్కునే క్రెడిట్ తో పాటు ఇది కూడా చెప్పుకోగలరా మన బీజేపీ నాయకులు. దక్షిణాది రాష్ట్రాల పై ఇటు వంటి సవతి తల్లి ప్రేమతో ఏ విధంగా తామే హీరోలం అని చెప్పుకోగలరో వారే చెప్పాలి? ఏపీ బీజేపీ – పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే వారికి కోపం రావొచ్చుగాక!