Somu Veerraju- clarifies on capital amaravatiరాజధాని విషయంలో బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మూడు రాజధానులు మద్దతుగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. నిన్న మీడియాతో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఏపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌కు పంపించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

ఆర్టికల్‌ 254 ప్రకారం గవర్నర్‌ ఆ బిల్లును కేంద్రానికి నివేదించాలే తప్ప ఆమోదించే ఆస్కారం లేదన్నారు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్రానిదే తుది నిర్ణయం అన్నారు. అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్‌ ఇండియా కూడా గుర్తించిందని గుర్తు చేశారు. రాజ్యసభ్య ఎంపీగా చెబుతున్నా కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నారు.

అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు’అంటూ ట్వీట్ చేశారు.

దీనితో ఆ పార్టీ మూడు రాజధానులు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అదే జరిగితే విభజన బిల్లులకు గవర్నర్ ఆమోదం కొద్దిగా ఆలస్యమైనా లాంఛనమే. ఇక అమరావతికి తమ భూములిచ్చిన రైతుల భవిష్యత్తు కోర్టులే దిక్కు.