Somu Veerraju AP BJPదుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికలలో తెలంగాణ బీజేపీ సత్తా చాటడంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా తమ ఉనికిని చాటుకోవడానికి తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా విశ్వప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నేతలు తిరుపతిలో మకాం వేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తిరుపతికి కేంద్రం ఎంతో చేసిందని ఊదరగొడుతున్నారు.

నిన్న తిరుపతిలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఇప్పటివరకు తిరుపతి స్మార్ట్ సిటీ కార్యక్రమం కింద 2014-2020 మధ్య 50,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని… ఆయా ప్రాజెక్టులు చివరి దశకు చేరుకున్నాయని… ఇంకా ఎన్ని నిధులు కావాలంటే అన్ని కేటాయిస్తామని చెప్పుకొచ్చారు.

ఒక్క తిరుపతికే కేంద్రం 50,000 కోట్లు కేటాయించింది అంటే అక్కడ ఉన్న వారంతా కళ్ళు తేలేశారు. అసలు విషయం ఏమిటంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీలకు కేటాయించిన నిధులు 96,000 కోట్లు… అందులో ఇప్పటివరకు మొత్తం అన్ని నగరాలకు కలిపి కనీసం 10,000 కోట్లు కూడా ఖర్చు చెయ్యలేదు. మరి ఒక్క తిరుపతికే 50,000 కోట్లు ఎలా అనేది సోము వీర్రాజే చెప్పాలి.

ఏదో 100 కోట్లు ఇచ్చాం… రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు ఇచ్చాం అంటే నమ్ముతారేమో… బొత్తిగా నిజాయితీ అనేది లేకుండా ఏకంగా 50,000 కోట్లు అంటే అసలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇలాంటి మాటలతో తిరుపతి గెలవగలము అని అనుకుంటే పొరపాటే అవుతుంది కూడా.