Somu -Veerraju supports narendra modi on cheating andhra pradeshదక్షిణాదిలో ఎలాగైనా తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఎలాంటి రాజకీయలకైనా వెనుకాడడం లేదన్న సంకేతాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పంపుతోన్న వైనం తెలిసిందే. ‘విభజించు – పాలించు’ మాదిరి స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలను వినియోగించుకుని, ఆ రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయా పార్టీలను ప్రోత్సహిస్తూ ఉన్న వైనం ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలలో అనుసరించగా, తాజాగా ఏపీలో కూడా అదే తీరును కొనసాగిస్తోంది.

అన్ని దక్షిణాది రాష్ట్రాలు… మరీ ముఖ్యంగా ఇప్పటివరకు అడ్రస్ లేనటువంటి ఏపీలో ఎలాగైనా తమ జెండా పాతాలని ఊవ్విళ్ళూరుతున్న బిజెపి పోకడ, ఆ పార్టీ నేతలకే రుచించడం లేదు. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేద్దామని స్థానిక అధికార పార్టీపై నిప్పులు చెరిగిన సోము వీర్రాజు అయితే, ఇప్పుడు ఎవరికీ దొరకని “అజ్ఞాతవాసి”గా మారిపోయాడంటే, బిజెపి ఏ రేంజ్ లో తమ భావాన్ని రుచిచూపించిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక రకంగా సినిమా ‘అజ్ఞాతవాసి’ పవన్ కళ్యాణ్ అయితే, రాజకీయ అజ్ఞాతవాసిగా ప్రస్తుతం సోము వీర్రాజు మారారు.

పవన్ కూడా ఓ రకంగా ‘అజ్ఞాతవాసి’యే అని ఎవరికైనా డౌట్ వస్తే తప్పేంకాదు! అయితే ప్రస్తుతానికి ఈ టైటిల్ ను సోము వీర్రాజు సొంతం చేసుకున్నారు. కన్నా లక్ష్మీ నారాయణకు పార్టీ పదవి కట్టబెట్టడంతో కినుక చెందిన సోము, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఓ పక్కన చంద్రబాబు సర్కార్ పై అనాలోచితంగా వ్యాఖ్యలు చేసినందుకు నమోదైన కేసులు, మరో పక్కన నమ్మిన అధిష్టానం ఇచ్చిన జలక్ తో ప్రస్తుతం సోము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి ఈ అజ్ఞాతం ఎప్పటికీ వీడేనో గానీ, ఈ ‘అజ్ఞాతవాసి’ని బుజ్జగించేందుకు అధిష్టానం రెడీగా ఉన్నట్లు సమాచారం.