Somu -Veerraju supports narendra modi on cheating andhra pradeshటీడీపీ బీజేపీ పొత్తు వీగిపోవడంతో రెండు వైపులా ఉన్న మినిస్టర్లు రాజీనామా చేశారు. కొన్ని నామినేటెడ్ పదవులు పొందిన బీజేపీ వారు కూడా రాజీనామా చేస్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లతో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు మాత్రం తన పదవిని అంటిపెట్టుకునే ఉంటారట.

పైగా టీడీపీ – బీజేపీ కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాం… ముఖ్యమంత్రితోపాటు అందరూ రాజీనామాలు చేస్తే నేను చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లతో నేను ఎమ్మెల్సీ అయ్యా అంటే బీజేపీ ఓట్లతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని సోము వీర్రాజు అభిప్రాయంగా ఉంది.

మరోవైపు ఇప్పుడు ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆయన స్థానంలో సోము వీర్రాజును ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదటినుండి టీడీపీ అంటే పడని వీర్రాజు, బీజేపీ – టీడీపీ పొత్తు విఛ్చిన్నం కావడంలో కీలక పాత్ర పోషించారు.