Pawan Kalyan -Somu Veerrajuజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సామాజికవర్గానికి ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చెడగొట్టారని ఆయన అబిప్రాయపడ్డారు. రాజకీయాలలో ఎవరి కొమ్ము కాయడానికో పవన్ కళ్యాణ్ ,తనను నమ్ముకున్న సామాజికవర్గాన్ని నట్టేట ముంచారని ఆయన చెప్పుకొచ్చారు. కాపు సామాజికవర్గం వారు కూడా సీఎం కావాలనే ఉద్దేశంతో బీజేపీ 2014 సెప్టెంబరులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తమ పార్టీతో కలిసిపోవాలని కోరిందని వీర్రాజు చెప్పారు.

పవన్ కళ్యాణ్ గనుక అప్పుడే తమ ప్రతిపాదనకు అంగీకరించి ఉంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గం కూడా సీఎం పదవి రేసులో ఉండేదని ఆయన చెప్పడం విశేషం. రాజకీయాల్లో దార్శనికత గురించి చెప్పే పవన్ కళ్యాణ్ డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని ఆరోపించారు. 2014లో పవన్ కళ్యాణ్ ను తానే నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్లానని, అప్పటి ఎన్నికల్లో బీజేపీ– జనసేన కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదిస్తే.. పవన్‌కల్యాణ్‌ టీడీపీతో కలిసి మూడు పార్టీలు పోటీ చేయాలని ఆయన చెప్పడం విశేషం.

ఇది పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేకపోతే ఆయన సామాజికవర్గం మీద ప్రేమ అన్నట్టుగా కనపడటం లేదు. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు వచ్చేవి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని ఆయన బాధ అనుకుంట. అప్పుడు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా పోటీ చెయ్యను అని చెప్పిన వీర్రాజుగారు కూడా బహుశా పోటీ చేసే వారేమో. అసలు నిజం ఏమిటంటే 2014లో ఏమో గానీ 2019లో బీజేపీతో గనుక పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ఉంటే వారితో పాటు ఆయన కూడా మునిగే వాడు.