Somu Veerraju -2019 ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేస్తామని, జనసేనతో బీజేపీ పొత్తును కాలమే నిర్ణయిస్తుందని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబుతో పొత్తు వద్దని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు చెప్పానని, కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తులు కావాలన్నారని వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ కంటే ముందుగా బీజేపీ చంద్రబాబుతో చేతులు కలిపింది. అప్పటి ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ వచ్చి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ను పొగిడి టీడీపీకి ఫీలర్లు వదిలారు. మరి పవన్ కళ్యాణ్ కు హితబోధ చేసిన సోము వీర్రాజు మరి తమ సొంత పార్టీ వారికి ఎందుకు చెప్పలేకపోయారో.

అదే సమయంలో టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇప్పటికి ఆయన ఎందుకు కొనసాగుతున్నారో. బహుశా బీజేపీలో సోము వీర్రాజుకి ఉన్న స్థాయి ఏంటో ఆయనే చెప్పేశారు అని టీడీపీ వారు అంటున్నారు. అందుకే సోముని కాదని వైకాపాలోకి వెళ్లే కన్నా లక్ష్మీనారాయణను ఆపి మరి అధ్యక్షుడిని చేశారు అని వారు ఎద్దేవా చేస్తున్నారు.