Somu -Veerraju to meet Mudragada Padmanabhamచంద్రబాబు మీద అక్కసో ఇంకోటో తెలీదు గానీ రాష్ట్ర బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అని చెప్పబడుతున్న ఫోన్ ట్యాపింగ్ ని సమర్ధించడం ఆశ్చర్యకరం. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అసలు ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ రాష్ట్రానికి తెచ్చిందే చంద్రబాబు, ఇప్పుడు ఏమి తెలియనట్టు కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నాడు అంటూ విమర్శించారు.

“చంద్రబాబు హయాంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గారు నాకు ఫోన్ చేసి ఛత్తీస్గఢ్ కు చెందిన ఒక నక్సలైట్ మీకు ఫోన్ చేస్తున్నాడు. వాడు అందరిదగ్గర డబ్బులు వసూలు చేస్తాడు ఇంకోసారి ఫోన్ చేస్తే నాకు చెప్పండి అన్నాడు. అయితే నా ఫోన్ టాప్ చేసినట్టు కాదా? ఏమి తెలియనట్టు కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నాడు,” అంటూ విమర్శించారు.

ఒక నక్సలైట్ మీద నిఘా సంస్థలు దృష్టి పెట్టడం చట్టరీత్యా తప్పేమీ కాదు. అది అన్ని దేశాలలోనూ జరిగేదే. న్యాయసమ్మతమే కూడా. ఫోన్ టాప్ చేస్తే అది ఆ నక్సలైట్ ఫోన్ టాప్ చేసినట్టు.. ఆ విషయం పక్కన పెడితే అసలు నక్సలైట్లు వీర్రాజుకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనేది అసలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ అది నిజం కాకపోతే ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు కాదు కదా? అది పక్కన పెడితే… “ఫోన్ ట్యాప్ చెయ్యడం అనేది ప్రభుత్వంలో సహజం ఏమో? స్టాటజీలో సహజం ఏమో? ఈ ముఖ్యమంత్రి కూడా నా ఫోన్ ట్యాప్ చేస్తాడు… నేను వేరే ఫోన్ లో మాట్లాడుకుంటా,” అని ఫోన్ ట్యాపింగ్ గురించి చాలా తేలికగా చెప్పడం గమనార్హం.