Somireddy Chandramohan Reddyరాష్ట్రంలో పింఛన్ల భారం తగ్గించుకోవడానికి సుమారు లక్షన్నర మందికి అధికారులు నోటీసులు ఇచ్చిన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై సిఎం జగన్ స్పందిస్తూ రీ-వెరిఫికేషన్ చేస్తుంటే ప్రతిపక్షాలు, మీడియా పింఛన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నాయి. కనుక కలెక్టర్లు వారికి ధీటుగా జవాబు చెప్పాలి,” అని చెప్పడంపై టిడిపి నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ, “ఏందయ్యా స్వామీ..కలెక్టర్లను కూడా మాపైకి మళ్లిస్తుండావా..ఇప్పటిదాకా నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో తిట్టిస్తుంటివే..మాతో పాటు మా కుటుంబాల్ని, తాతముత్తాల్ని కూడా వదలకపోతిరి..ఇప్పుడు కలెక్టర్లను కూడా తిట్లదండకం అందుకోమంటున్నావా? లక్షల మంది పేదల పింఛన్లు తొలగిస్తున్నందుకు సిగ్గు పడాల్సిందిపోయి..తప్పేముందని సమర్ధించుకోవడం నీకే చెల్లిందయ్యో,”అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

జై టిడిపి స్పందిస్తూ, “కలెక్టర్లు ప్రెస్‌మీట్‌లు పెట్టి తిట్టాలంట. ఇంకా నయం బూతులు తిట్టడంలో కొడాలి నాని దగ్గర శిక్షణ తీసుకోమని చెప్పలేదు. పాపం! కలెక్టర్లకు ఇదేం ఖర్మో! మొత్తంమీద ఒకటి మాత్రం స్పష్టమైంది. వైసీపీ మీద జనాలకి నమ్మకం పోయింది. అది జగన్ రెడ్డి మాటల్లో తెలుస్తోంది,” అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.

ప్రతిపక్షాలు, మీడియా వేలెత్తిచూపకపోయినా పింఛన్లు తొలగిస్తే ఆ చిన్న ఆసరా కోల్పోయే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని శపించకుండా ఉంటారా?వారి ఉసురు వైసీపీకి తగలకుండా ఉంటుందా?

తమని వేలెత్తి చూపేవారిని కలెక్టర్ల చేత తిట్టించే బదులు అవసరం లేకపోయిన నియమించుకొన్న డజన్ల కొద్దీ ప్రభుత్వ సలహాదారులను, వారిపై కోట్ల రూపాయల ఖర్చును తగ్గించుకొంటే ఆ సొమ్ము పింఛన్లకి ఉపయోగపడుతుంది కదా? దీంతో ప్రభుత్వంపై ఆర్ధికభారం తగ్గుతుంది. ప్రతిపక్షాలు, ప్రజలు కూడా సంతోషిస్తారు కదా?