Solo Brathuke So Better Movie in single theatresసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ కరోనా తరువాత విడుదలవ్వబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమా. 50% సినిమా థియేటర్ల సామర్ధ్యం మేర సినిమాలు ప్రదర్శించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ లోనే అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటికీ చాలా థియేటర్లు ముఖ్యముగా సింగల్ స్క్రీన్ థియేటర్లు ఓపెన్ కాలేదు.

ఈ నెల మొదటి వారం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్లు ఓపెన్ అయ్యాయి. హాలీవుడ్ సినిమా టెనెట్, పాత సినిమాలు ప్రదర్శిస్తూ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సింగల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం ఇప్పటివరకు పెద్దగా ఓపెన్ కాలేదు అనే చెప్పుకోవాలి.

అయితే మల్టీప్లెక్స్లు లాగా ట్రయల్స్ వేసే ఉద్దేశంలో సింగల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు లేరట. అందుకే డైరెక్ట్ గా డిసెంబర్ 25నే ఓపెన్ చెయ్యడానికి వారు సిద్ధం అవుతున్నారు. “పాత సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకులను రమ్మంటే ప్రయోజనం ఉండదు. కొత్త సినిమాతోనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఆరోజునే థియేటర్లు ఓపెన్ చేస్తాం,” అని వారు అంటున్నారు.

మరోవైపు, క్రిస్మస్ విడుదలకు సుమంత్ యొక్క కపటధారి కూడా క్రిస్మస్ కు ప్రకటించారు. అయితే ఆ సినిమా మేకర్స్ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. ఈ రెండు చిత్రాల పరిస్థితి సంక్రాంతి విడుదలల శ్రేణిని నిర్ణయిస్తుంది. ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే, జనవరిలో ఓటీటీ మార్గంలో ,మరిన్ని సినిమాలను చూడవచ్చు.