social warbetween TDP janasenaరాబోయే ఎన్నికలలో టీడీపీ మరియు జనసేనలు కలిసి ఎలా పోటీ చేస్తాయో గానీ, ప్రస్తుత సోషల్ మీడియా పరిస్థితి అయితే ఎవరికి అవకాశం వచ్చినపుడు వారు ప్రత్యర్థిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా హైదరాబాద్ లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన వేదిక అయ్యింది.

రాడిసన్ పబ్ లో జరిగిన ఉదంతంలో మెగా డాటర్ నిహారిక మీడియా వార్తల్లో నిలవడంతో, జనసేనను టార్గెట్ చేస్తూ టీడీపీ వర్గీయులు ట్రోల్స్ చేసారు. కానీ ‘మరో సాక్షి’గా లోకేష్ కొనియాడిన మీడియా ఛానల్ లో ఎన్టీఆర్ కూతురు అల్లుడు కూడా ఈ ఉదంతంలో ఉన్నారంటూ ప్రసారాలు గావించింది.

దీంతో సదరు మీడియా ఛానల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తో జనసైనికులు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కోసం ఇరువురు నేతలు ప్రయత్నిస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం ఇరుపక్షాలు ‘ఢీ అంటే ఢీ’ అనుకునే విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.

నాడు జరిగిన పరిణామాలకు ఇప్పటికే రాడిసన్ పబ్ యొక్క అనుమతులన్నీ తెలంగాణా సర్కార్ రద్దు చేయగా, వాటి మీద ఈ ఇద్దరూ ట్రోల్స్ చేసుకోవడం విశేషం. ‘పసుపు’ Vs ‘ఎరుపు’గా కొనసాగుతోన్న ఈ సోషల్ మీడియా యుద్ధం వలన లాభపడేది ‘బులుగు’ మాత్రమేనని ఈ రెండు రంగుల వారు ఎప్పటికి గమనిస్తారో?!

ప్రస్తుతం రాడిసన్ పబ్ కు సంబంధించిన కేసు విచారణ దశలో ఉండగా, మీడియా వర్గాలు కూడా రాజకీయంగా టార్గెట్ చేయడానికి ప్రత్యేక కధనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. అందులోనూ ప్రసారం చేసిన ఛానల్ పేరును లోకేష్ ముద్దుగా ‘మరో సాక్షి’ అని పిలుస్తుండడం, ఈ కధనంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

సంఘటన జరిగిన రోజు దాదాపుగా 150 మందిని అరెస్ట్ చేసినప్పటికీ, రాహుల్ వంటి సింగర్స్ తమ ప్రమేయం లేదని, కేవలం ఫ్యామిలీ వేడుక జరుపుకుంటున్నామని అదే ‘మరో సాక్షి’ వేదికగా తమ భావాన్ని చెప్పి, సదరు విలేఖరిని ఎదురు ప్రశ్నించారు. సో… అటు మెగా డాటర్ అయినా, ఇటు మరో వర్గం అయినా నిజాలు తెలియకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సబబు కాదు.