Social-Media-Trolls-on-MP-Gorantla-Madhav-వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సెక్సీ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్స్ చాలా ఆలోచనాత్మకమైన కామెంట్స్ చేస్తున్నారు.

“ఒక సాధారణ సీఐ (గోరంట్ల మాధవ్) ఎంపీ కాగలిగాడు. ఒక సీబీఐ ఆఫీసర్ (లక్ష్మినారాయణ) ఎంపీ కాలేకపోయారు. ఓటమి పాలయ్యారు. లోపం ఎక్కడుంది? చదువులో ఉందా? నడవడికలో ఉందా?నేపధ్యంలో ఉందా?జనంలో ఉందా? టికెట్ ఇచ్చినా పార్టీలలో ఉందా? ఆలోచించాల్సిన సమయం ఇదే…” అంటూ ఓ జర్నలిస్ట్ వారి ఇరువురి ఫోటోలు వేసి ట్వీట్ చేశారు.

టిడిపి సీనియర్ నేత బోండా ఉమా స్పందిస్తూ, “ఇదివరకు అవంతి శ్రీనివాస్ ఓ వైసీపీ మహిళా నేతను అరగంట సేపు తనతో గడపమని అసభ్యంగా ప్రవర్తిస్తే ఆయనకు జగన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తరువాత అంబటి రాంబాబు సంజన అనే యువతిని ‘నువ్వు జీన్స్ ఫ్యాంట్ వేసుకొని రా ఓ గంటసేపు గడుపుదాం…’ అంటే జగన్ రెడ్డి ఆయనకి మాతృ పదవి ఇచ్చారు. జోగు రమేష్ ఓ త్రాగుబోతు ఎమ్మెల్యే. అతను మూడు సంవత్సరాలుగా పెడనలో మహిళా వాలంటీర్లను వేధిస్తుంటే వారు ఉద్యోగాలు వదిలి పారిపోయారు. అతనికి జగన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ చేసి మాట్లాడాడని వీడియో చూసినా జగన్ రెడ్డి అతనిపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ఎందుకంటే జగన్ రెడ్డి టీంలో అందరూ ఒకరిని మించినవారొకరే,” అని అన్నారు.

టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత వంగలపూడి ట్విట్టర్‌లో స్పందిస్తూ, “వైసీపీ ఎంపీ మాధవ్ చేష్టలతో ఏపీ పరువు పోయింది. ఇటువంటివారిని చట్టసభలకు పంపిస్తే ఇలానే ఉంటుంది. మాధవ్ వ్యవహారంపై మహిళా ఛైర్ పర్సన్‌ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? జగన్ ప్రభుత్వం కౌరవ సభను తలపిస్తోంది. ఏపీలో మహిళలకు రక్షణ లేని పాలన సాగుతోంది,” అని ట్వీట్ చేశారు.

ఇక ఐ-టిడిపి త్రీ ఇడియట్స్ సినిమా ఫోటో వేసి “మూడు కుర్చీలలో అవంతి, అంబటి, గోరంట్లను పెట్టి వారి వెనక గంట, అరగంట, గోరింటాకు అని చెప్పదలచుకొన్న విషయాన్ని చాలా ఘాటుగా చెప్పేసింది.

మరో నెటిజన్ “గంట… అరగంట… గోరంట్ల… జగన్ రెడ్డి నవరత్నాలలో మూడు తేలినాయి. బయటపడని రత్నాలు ఇంకెన్నో?ఆంబోతుకు అచ్చేసి రోడ్డు మీదకు వదిలినట్టు, జగన్ రెడ్డి వీళ్ళకు వైసీపీ కండువాలు వేసి జనాల మీదకు వదిలినట్టుంది. లేకపోతే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు?” అంటూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు.