నెక్స్ట్ ఏంటన్నా... కర్రీ పాయింట్ యేనా..?గడిచిన కొద్దీ నెలలుగా ప్రతి రోజు ఏదొక అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నెటిజన్లు ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అలా ప్రతి రోజు పుష్కలమైన, పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తోన్న వైసీపీ సర్కార్, లేటెస్ట్ గా నిజంగా పౌష్టికమైన ఆహరంపై ట్రోల్ కు గురవుతోంది.

లైవ్ మరియు మెరినేటెడ్ ఉత్పత్తులతో పాటు, రుచికరమైన వివిధ రకాల వంటకాలు ‘ఫిష్ ఆంధ్ర’ స్టోర్స్ లో లభ్యమవుతాయని ఏపీ సర్కార్ రూపొందించిన పోస్టర్ ఒకటి మునుపెన్నడూ లేనంత వైరల్ అవుతోంది. ఇందులో వండిన కూర అందుబాటులో ఉంటుందని ప్రత్యేకంగా పేర్కొన్నారు.

గడిచిన నాలుగైదు నెలలుగా ఈ ‘ఫిష్ ఆంధ్ర’ ప్రాజెక్ట్ ను రూపొందించడంలో జగన్ సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. బ్యాంకు ఆఫ్ బరోడా సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన ఈ ఫిష్ ఆంధ్రను నెటిజన్లు ఓ స్థాయిలో ఆడేసుకుంటున్నారు.

అన్నా… తెలియక అడుగుతున్నా… డోర్ డెలివరీ ఉంటుందా…
ఈ పథకం మెట్రో సిటీలకేనా? రూరల్, అర్బన్ ఏరియాల్లో ఉండదా?
నెక్స్ట్ ఏంటన్నా… కర్రీ పాయింట్ యేనా?

ఇలా చెప్పుకుంటూ పోతే… ‘గబ్బర్ సింగ్’లో రాస్కోరా సాంబ… అన్న రీతిలో పంచ్ లకు పని చెప్పారు నెటిజన్లు. ఇలాంటి వ్యంగ్యాస్త్రాలతో పాటు ప్రస్తుతం చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ప్రజల ఆవేదనలతో కూడిన మేమ్స్ సోషల్ మీడియాను చుట్టుముట్టేశాయి.