KCR-KTRతెలంగాణలోని అధికార పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెరాస తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్టు చేసింది. తెలంగాణ అనేది ఒక యాస అని బాషా కాదని కేవలం తెరాస తన రాజకీయ లబ్ది కోసమే దానిని భాషగా చూపి సెంటిమెంట్ ను పండించాలని చూస్తుందని నెటిజెన్లు ఆరోపిస్తున్నారు.

తెలుగు భాషను తెలంగాణ భాష అంటూ విడదీసి చూపడం వల్లే ఉత్తర భారత దేశం వారికి లోకువ అవుతున్నామని వారు బాధ పడుతున్నారు. అందుకే ఇప్పటికీ చాలా మంది మనల్ని మదరాసీలుగానే చూస్తున్నారని వాపోతున్నారు. తెరాస చేస్తున్న ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో కొందరు తెలంగాణ వారు కూడా ఉండటం గమనార్హం. చాలా మంది ఈ విషయంగా కేసీఆర్, కేటీఆర్ ల ట్విట్టర్ అకౌంట్లను టాగ్ చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పోస్టులో కూడా తెలంగాణ యాసలో రాయకపోవడం గమనార్హం. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఇటువంటి అంతరాలతో ముందుకు పోవడం విచారకరం. పైగా ఒకపక్క మనం తెలుగు వారం, తెలుగు వారందరు కలిసే ఉండాలని మాట్లాడుతూ. తెలుగు భాషను కూడా గుర్తించకుండా తెలుగు వారందరి కోసం కలిసి పని చేస్తాం అంటూ కేసీఆర్ అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా?