social media trolls on rakul preet singhటాలీవుడ్ టాప్ హాట్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ కి స్థానం లేదు అంటే, అంతకన్నా ఘోరమైన తప్పుడు స్టేట్మెంట్ ఉండదేమో అన్నది నా స్ట్రింగ్ ఫీలింగ్ ఎందుకంటే, మనం ఎంత కాదనుకున్నా ఆమె ఎందరికో కలల రాకుమారి. అయితే ఈ క్రమంలో రకుల్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో ఏమాత్రం సంభంధం లేకుండా వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది. అంటే చెప్పుకోకూడదు కానీ ఆ మధ్య ఉన్న జోరు ఈ మధ్య కాస్త తగ్గింది, ఇది మనలో మనం మాట బయట ఎక్కడా చెప్పకండీ. సరే ఇక ఈ కధ అంతా పక్కన పెట్టేసి, అసలు ఈ “కాస్త తినమ్మా” అనే వెటకారం గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడుకుందాం…

మ్యాటర్ ఏంటి అంటే, హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బహుశా తన జీరో సైజ్ ఫోటో అనుకుంట, చాలా కాలం తరువాత మంచి హాట్ లుక్ తో, ” Beauty begins a the moment you decide to be yourself ” భారీ కొటేషన్ లో ట్వీట్ చేసింది. అయితే లుక్ అయితే అదిరింది. ఆమె పెట్టిన కొటేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ ఫోటోకి ఫిదా అయిన ఫాన్స్ ఎవరికి తోచిన రీతిలో వారు రిప్లై ఇవ్వడం మొదలు పెట్టారు. కొందరు సూపర్, సెక్సీ, ఈ లవ్ యూ, నువ్వు నా కలల రాకుమారివి అంటూ ఉంటే, ఇంకొందరు నువ్వు కత్రీనా కైఫ్ లాగా ఉన్నావ్, పొద్దు పొద్దునే మతి పోగొట్టేశావ్ అంటూ తమపై ఉన్న అభిమానాన్ని కురిపిస్తే.

ఇక మరో పక్క మరి కొందరు అయితే తమ సెటైరికల్ నేచర్ కి పదును పెట్టారు. కొన్ని సిల్లీ కొమెంట్స్ తో ఆమెపై ఉన్న అభిమానాన్ని వ్యక్త పరిచారు. అందులో ఒకరైతే ‘ప్యాంట్ లూసా’ అంటూ వెటకారంగా రిప్లే ఇస్తే, మరొకరు, “స్కెలిటెన్ లా ఉన్నావ్” అంటూ వెటకారంగా రిప్లే ఇచ్చారు. ఇంకో వీరాభిమాని అయితే…ఇంకాస్త డోస్ పెంచి “కొంచెం ఫుడ్ తిను” అంటూ రకుల్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

మొత్తంగా రకుల్ ప్రీత్ ఫోటోకి ఫిదా అయిపోయారు ఆమె ఫాన్స్ కమ్ ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్. మీరు కూడా ఆ హాట్ లుక్ పై మీ లుక్ వెయ్యాలి అంటే..ఇంకెందుకు ఆలస్యం ఈ లింక్ పై క్లిక్క్ చెయ్యండి!