Nagarjuna Akkineni -‘సినీ వేదికపైన రాజకీయాలు మాట్లాడను’ అని అన్న నాగార్జున వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన సోషల్ మీడియా జనులు, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి గత వీడియోలను వెలుగులోకి తీసుకువచ్చారు. నాడు ఓ సినీ వేదికపై నాగార్జున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అడిగిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

ఒకప్పుడు ఇంత డేరింగ్ గా ప్రభుత్వాన్ని నిలదీసిన నాగార్జున, ఇప్పుడు ఎందుకు ఇలా చప్పబడిపోయారు అని అభిమానులు వాపోతుండగా, నాడు సినీ వేదికపై రాజకీయ ప్రశ్నలు వేసిన నాగార్జున, నేడు ఎందుకు వేయలేకపోతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియో ఎప్పటిదా అని శోధిస్తున్న వారికి జవాబుగా “రగడ” ఆడియో వేడుక అని స్పష్టమైంది. 2010లో జరిగిన ఈ వేడుక జరిగే సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2009లో వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఎక్కిన కాంగ్రెస్ సర్కార్ పై నాగ్ ధ్వజమెత్తిన వీడియో అది.

దీన్ని కూడా రాజకీయ కోణం నుండి చూస్తోన్న నెటిజన్లు… వైఎస్సార్ చనిపోయిన తర్వాత నాడు జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం వలనే, నాగార్జున అప్పటి ప్రభుత్వంపై ఓ సినీ వేదికలో సైతం పొలిటిక్స్ మాట్లాడారని లాజికల్ గా నెటిజన్లు చేస్తోన్న కామెంట్లకు కొదవలేదు.