social media trolls nani tuckjagadishగతంలో సినిమాల పేరు చెప్పి ఫ్యాన్స్ రోడ్ల మీద గొడవలు పడేవారు. కొట్టుకుని రక్తాలు కారిన సందర్భాలు కూడా ఉండేవి. కాలక్రమేణా ఆ గొడవల తీవ్రత తగ్గి ఇప్పుడు ఆ గొడవలు సోషల్ మీడియాకు చేరిపోయాయి. దానితో ట్రోల్ కల్చర్ మొదలయ్యింది.

సహజంగా ఏదైనా సినిమా గానీ సినిమాకు సంబంధించిన మెటీరియల్ ని ఎక్కిరించే బ్యాచ్ ఎలాగూ ఉంటుంది. అసలు ట్రోల్ల్స్ ని నమ్ముకుని సైట్లు… సోషల్ మీడియా పేజీలు కూడా మొదలయ్యాయి. వీళ్ళ క్రియేటివిటీ తో బ్యాడ్ సినిమాలు తీసేవాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు.

మంచి క్రియేటివ్ గా ఉన్న ట్రోల్ల్స్ అయితే సోషల్ మీడియా, వాట్సాప్ లో వైరల్ అయ్యి తలపోటుగా మారుతున్నాయి. ట్రోల్ల్స్ విషయంలో కూడా కొన్ని కొన్ని సినిమాలు గట్టిగా దొరికేస్తాయి. ఆ క్యాటగిరిలో మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పుకోవాలి.. ఆ సినిమా విషయంలో ట్రోల్స్ కు కొత్త నిర్వచనం వచ్చేసింది.

ఆ తరువాత అదే కోవలో వచ్చిన నితిన్ శ్రీనివాస కళ్యాణం కూడా అలాగే ట్రోల్ల్స్ దాటికి బలైపోయింది. తాజాగా నాని టక్ జగదీష్ ఈ బ్యాచ్ లో చేరింది. విశేషం ఏమిటంటే… బ్రహ్మోత్సవం లో జరిగిన తప్పులే శ్రీనివాస కల్యాణంలో రిపీట్ అయ్యాయి.. ఆ రెండు సినిమాలలో జరిగిన తప్పులే టక్ జగదీష్ లో రిపీట్ అయ్యాయి.

స్టార్ హీరోలైన మహేష్ బాబు, నానిలకు సైతం ఇలా చేస్తే ట్రోల్ల్స్ వస్తాయి అనే స్పృహ లేకపోవడం శోచనీయం. రెండు డోజన్ల పాత్రలు… ఆ పాత్రలు ఎవరికి ఏం అవుతారో ఒకానొక సందర్భంలో డైరెక్టర్ కూడా అర్ధం కాలేదేమో అంటే అతిశయోక్తి కాదు. ఇక సామాన్యుల పరిస్థితికి వస్తే ఎవరు మీలో కోటీశ్వరులలో దానికి సంబంధించిన ప్రశ్న అడిగితే కంప్యూటర్ కూడా కంగారు పడుతుందేమో!