Arun Jaitley -Narendra Modiసోషల్ మీడియా వేదికగా ఓ నినాదం జోరుగా వినపడుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ సర్కార్ ఏపీపై వేసిన ‘సీతకన్ను’ను ప్రతిబింబించేలా ఓ పోస్ట్ సందడి చేస్తోంది. విభజన చట్టంలో ఏపీకి ఇవ్వాల్సిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు తెలియజేస్తోన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మోడీ అండ్ కో నుండి వెలువడుతోన్న సమాధానం మాత్రం ఒక్కటే… “అది తప్ప అన్ని ఇచ్చాం.” అదేదో ఈవీవీ సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ టైటిల్ మాదిరి… ఏపీకి ఇవ్వాల్సినవి ఏవీ లేవు అని ప్రారంభించే ‘మోడీ అండ్ కో,’ ఆ తర్వాత ఎదురయ్యే ప్రశ్నలకు ఇచ్చే సమాధానమే “అది తప్ప అన్ని ఇచ్చాం.” ముందుగా ప్రత్యేక హోదా అడిగితే ‘అది తప్ప అన్ని ఇచ్చాం. ఆ క్రమంలోనే…

రైల్వే జోన్ అడిగితే… అది తప్ప అన్ని ఇచ్చాం….
కడప ఉక్కు ఫ్యాక్టరీ…. అది తప్ప అన్ని ఇచ్చాం…
విశాఖ రైల్వే జోన్… అది తప్ప అన్ని ఇచ్చాం…
దుగ్గిరాజు పట్నం పోర్టు… అది తప్ప అన్ని ఇచ్చాం…
వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్… అది తప్ప అన్ని ఇచ్చాం…
లోటు బడ్జెట్… అది తప్ప అన్ని ఇచ్చాం…
పోలవరం నిధులు… అది తప్ప అన్ని ఇచ్చాం…
రాజధాని నిర్మాణం… అది తప్ప అన్ని ఇచ్చాం…
విజయవాడ, విశాఖ మెట్రో…. అది తప్ప అన్ని ఇచ్చాం…
జాతీయ యూనివర్సిటీలకు పూర్తి నిధులు…. అది తప్ప అన్ని ఇచ్చాం…

ఇలా చెప్పుకుంటూ పోతే ఓ భగవద్గీత పుస్తకమంత అవుతుంది ఈ చిట్టా. ఏపీకి కేంద్రం చేసిన ద్రోహానికి ప్రజలు ఏ స్థాయిలో రగిలిపోతున్నారో అని చెప్పడానికి నిదర్శనమే ఈ పోస్ట్ వైరల్ కావడానికి కారణం. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు వచ్చేటపుడు మోడీ తీసుకువచ్చిన మట్టి, నీరు తప్ప ఏపీకంటూ ప్రత్యేకంగా ఇచ్చిందేమి లేదన్న ఆవేదన, ఆగ్రహం నానాటికి పతాకస్థాయికి చేరుకుంటోంది.