Social media praises ys jagan చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుండగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం అంటూ అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హడావిడి చేశారు. సదస్సు అయ్యాకా పెట్టుకోండి అంటూ అప్పట్లో ఆయనను ఎయిర్ పోర్టులోనే నిలువరించారు పోలీసులు. ఆ తరువాత జగన్ ఎప్పుడు విశాఖ వెళ్లి ఆ నిరసన చెయ్యలేదు.

అయితే దాదాపుగా రెండేళ్ల పాటు పోలీసు పహారా మధ్య ఆయనను పాదయాత్ర చెయ్యనిచ్చింది అప్పటి ప్రభుత్వం. ఏనాడూ అందుకు అడ్డు చెప్పలేదు. అయితే ముఖ్యమంత్రి అయ్యాకా జగన్ కు అవేమీ గుర్తులేవు. గత ఏడాది విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుని వైకాపా కార్యకర్తలు నిలువరించారు.

తాజాగా సోమవారం పర్మిషన్ లేదంటూ కరోనా అంటూ మరోసారి రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పోలీసులతో ఆపారు. దానికి హీరోయిజం, రివెంజ్ అంటూ సోషల్ మీడియాలో ప్రగల్బాలు పలుకుతున్నారు ఆ పార్టీ అభిమానులు. అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి… చట్టప్రకారం నడుచుకోకపోవడం ఏ విధంగా హీరోయిజం అనేది వారే ఆలోచించుకోవాలి.

రాజకీయాలలో కక్షపూరిత రాజకీయాలు నడిపితే అది గొప్ప అనిపించుకోదు. ప్రత్యర్థిని తన కార్యక్రమాలు తాను చేసుకోనివ్వని ఇన్ సెక్యూరిటీ ఉంటే 151 సీట్లు గెలిచి లాభం ఏమిటి? పట్టుమని పాతిక మంది ఎమ్మెల్యేలు కూడా లేని పార్టీని చూసి భయపడుతున్నారు అనిపించుకుంటే అదేం హీరోయిజం?