social media jokes on YS Jagan vision2019 ఎన్నికలలో సోషల్ మీడియాపై వైఎస్సార్ కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పెద్ద బృందమే దీని కోసం పని చేస్తుంది. పార్టీని సపోర్టు చేస్తూ ట్వీట్లు వేసేవారికి పెద్ద ఎత్తున డబ్బు కూడా ముట్టచెబుతుంది. ఈ క్రమంలో ట్విట్టర్ లో కూడా జగన్ యాక్టీవ్ గానే ఉంటున్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈరోజు ట్విటర్‌లో పేర్కొన్నారు.

పారదర్శక పాలనతో, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, అవినీత రహిత, వికేంద్రీకృత ప్రభుత్వంతో ప్రజల ఇంటి వద్దకే పాలన అందేలా, స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని తెలిపారు. అయితే ఈ ట్వీట్ ను అవహేళన చేస్తున్నారు విపక్ష పార్టీ సమర్ధకులు. శుక్రవారం కోర్టు బోనులో నుంచుని అవినీతి రహిత పాలనా ఇస్తా అని చెబుతున్నావా జగనన్న అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

తన మీద కేసుల విచారణ నిమిత్తం జగన్ మోహన్ రెడ్డి ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టు కు హాజరు కావాల్సి ఉండడం అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాడు కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అవుతూ వచ్చారు జగన్. ఇది ఆయన రాజకీయ జీవితానికి ఒక పెద్ద మచ్చగా మిగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ కు అదృష్టం కలిసి వచ్చి సీఎం అయినా ప్రతి వారం కోర్టుకు వెళ్లాల్సిందే. ఇది ప్రతిపక్ష పార్టీల ప్రచార అస్త్రంగా మారిపోయింది.