Social jokes on YS Jagan attackవైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన జరిగిన దాడిని రాష్ట్ర అధికార పక్షంపై రుద్దేద్దామని భావించిన వైసీపీ ప్రయత్నాలు బెడిసికొట్టడం పక్కన పెడితే, అవి ‘బూమ్ రాంగ్’గా మారి వైసీపీని చావుదెబ్బ తీసాయి. దీంతో డిఫెన్స్ లో పడిన వైసీపీపై అధికార పక్షం వర్గాలు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నాయి. దీనికి నారా లోకేష్ “జగన్నాటకం” పేరుతో తెరలేపారు.

“వైకాపా కోడి కత్తి డ్రామా!” అంటూ ప్రారంభించి, “తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసిన వ్యక్తి, ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే” అంటూ ఇదంతా ‘జగన్ అండ్ కో’ ఆడించిన డ్రామా కొనియాడుతూ ‘#జగన్నాటకం’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసారు.

అలాగే “ఇటు ఫిన్ టెక్ కార్యక్రమాన్ని భగ్నం చేయడం, అటు ప్రజల సానుభూతిని పొందడం – ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకున్నాడు జగన్. కానీ ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతున్నా అదే సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించడం వరుసగా చూస్తూ వస్తున్నదే కాబట్టి జగన్ నాటకానికి ఏ ప్రయోజనమూ దక్కలేదు” అంటూ జగన్ ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ నారా లోకేష్ ప్రారంభించిన “జగన్నాటకం” ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

ఈ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగిస్తూ నెటిజన్లు మరియు తెలుగు తమ్ముళ్ళు ‘వైసీపీ అండ్ కో’పై వేస్తోన్న కౌంటర్లకు కొదవలేదు. ఇటీవల ‘అరవింద సమేత’లో చూపించిన ‘మొండికత్తి’ సూపర్ హిట్ కాగా, జగన్ ప్రదర్శించిన ‘కోడి కత్తి’ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని…, ‘కత్తి చిన్నది, కవరేజ్ పెద్దది’ అంటూ…, ‘నీ వలనే మా కత్తికి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది, ఓ సెల్ఫీ తీసుకుంటామని’ కోళ్ళు పరిగెడుతుంటే, జగన్ పారిపోతున్న కార్టూన్ వంటి పిక్స్ హిలేరియస్ గా ఉన్నాయి.

ఇలాంటి పోస్ట్ లకు కొదవలేదు గానీ, తెలుగుదేశం పార్టీ వర్గాలు ప్రారంభించిన ఈ “జగన్నాటకం” సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సక్సెస్ కావడం వైసీపీ వర్గాలకు రుచించని అంశం కాగా, టిడిపి వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇక నుండి “కోడి కత్తి” అంటే ‘జగన్ మోహన్ రెడ్డి ‘బ్రాండ్ అంబాసిడర్’ అన్న స్థాయిలో ఈ ట్రేండింగ్ జరుగుతోంది. చాలామంది అయితే తమ ‘డీపీ’లను ‘కోడి కత్తి’గా పెట్టుకుని మరీ ట్రెండ్ చేస్తుండడం విశేషం.