venomous-snake-at-atm-cash-centre-badradriపెద్ద నోట్ల రద్దుతో, ప్రవేశపెట్టిన 2000 రూపాయి నోటుతో చిల్లర లభించక ఓ పక్కన దేశ ప్రజలంతా కరెన్సీ కష్టాలు పడుతుంటే… మీకే కాదు, మాకు కష్టాలున్నాయంటూ ఓ పాము కూడా ఏటీఎంలోకి దూరడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానిక వాసుల్లో కలకలం రేగింది. అసలే ఏటీఎంలో డబ్బులు లభించక కష్టాలు పడుతుంటే… ఉన్న ఏటీఎంలో ఇలా పాము దూరండంతో తలలు పట్టుకోవడం ప్రజల వంతయ్యింది.

పాముల విషపు జాతులలో ఒకటిగా పేరుగాంచిన కట్ల పాము ఏటీఎంలోకి ప్రవేశించడంతో ప్రజలు లోపలి వెళ్ళాలంటే భయబ్రాంతులవుతున్నారు. అది కూడా సరిగ్గా ఏటీఎం కార్డు పెట్టే ప్రదేశంలో మరియు క్యాష్ తీసుకునే ప్రాంతంలో ఉండడంతో స్థానిక అధికారులకు హుటాహుటిన సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ పామును బయటకు పంపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే ఏటీఎంలోకి పాము రావడాన్ని చూసి… బహుశా మోడీ నిర్ణయానికి తమ జాతి కూడా మద్దతు తెలిపేందుకే వచ్చిందేమో అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల కౌంటర్లకు కొదవలేదు.