smitha kilikki songతెలుగులో ‘పాప్’ పాటలను పరిచయం చేసిన స్మిత, ఇటీవల ఆ పాటలకు కాస్త దూరంగా ఉంది. ఒకప్పుడు ‘మసక మసక చీకటిలో…’ అంటూ సంగీత ప్రపంచాన్ని ఊపిన స్మిత తాజా ప్రయత్నం కాస్త డిఫరెంట్ గా వుంది ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాలోని ‘కిలి కిలి’ భాష పదజాలంతో ఓ పాటేసుకుని, ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమాలో ‘కాళికేయ’గా నటించిన ప్రభాకర్ కూడా ఈ పాటలో మరోసారి తన ‘కిలి కిలి’ భాష ప్రావీణ్యతను చూపించాడు. భాష వినడానికి అర్ధం కాకపోయినప్పటికీ, స్మిత పాప్ సంగీతం శ్రోతలను అలరిస్తుంది. సంగీత దర్శకుడు నోయెల్ కూడా ఈ పాటలో స్మిత, ప్రభాకర్ లతో కలిసి ఆడిపాడాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ‘కిలి కిలి’ భాష పాట… వీక్షకుల కోసం….