sj-surya-tweets-fake-people-fake-adssj-surya-tweets-fake-people-fake-adsమురుగదాస్ – మహేష్ కాంభినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో విలన్ గా ప్రముఖ దర్శకుడు, హీరో ఎస్.జే.సూర్య నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సూర్య పేరిట ఓ ప్రచారం సర్క్యులేట్ కావడంతో జాగ్రత్తపడిన సూర్య అభిమానులను హెచ్చరించాడు. ఇంతకీ ప్రచారం ఏమిటంటే… ‘ఇప్పటివరకు దాదాపు 30 సినిమాలకు దర్శకత్వం వహించిన తానూ, భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తానని’ చెప్తూ ఓ ప్రకటన జారీ చేస్తున్నట్లుగా ఈ ప్రచారంలో ఉంది.

“తన కొత్త సినిమాకు నటీనటులు కావాలని, ఒక పెద్ద సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ తదితర అంశాలు ఈ క్రింద ఇచ్చిన లింక్ లో ఉన్నాయని, అవి చదివి నాతో చాట్ చేసేందుకు కొంత సమయం కేటాయించమని చెప్తూ” సర్క్యులేట్ అవుతున్న ప్రచారాన్ని పోస్ట్ చేస్తూ… దీనిని ఎవరూ నమ్మవద్దని, ఎవరో ఫేక్ పీపుల్ ఇలాంటివి పంపిస్తున్నారని ప్రేక్షకులకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. సినీ పరిశ్రమలో ఇలాంటి ఫేక్ ఉదంతాలకు కొదవ లేనప్పటికీ, ప్రస్తుతం దర్శకుల పేర్లు చెప్పి మరీ, వీటిని పాల్పడుతుండడం కొసమెరుపు.