Sivakarthikeyan doctor telugu movie public talkడాక్టర్….శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమిళ మూవీ. ఈ సినిమాను తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో అనువాదం చేశారు. తమిళ్ లో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ద మూవీ. అయితే తెలుగులో మాత్రం ఈ మూవీపై పెద్దగా అంచనాలేమీ లేవు. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో భారీ హైప్ ఇచ్చినప్పటికీ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరో కాకుండా అఖిల్ బాబును హీరోగా పెట్టింటుంటే పర్ఫెక్ట్ గా ఉండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొహంలో ఏమాత్రం ఎక్స్ ప్రెషన్స్ లేకుండా….పూర్తిగా ప్రాక్టికల్, ఇంటెలిజెంట్ గా ఉండే క్యారెక్టర్.

ఒక విధంగా చెప్పాలంటే రేసుగుర్రం మూవీలో శృతి హాసన్ పోషించిన క్యారెక్టర్ కు మేల్ వెర్షన్ అనుకోవచ్చు. సినిమా మొత్తంగా నాలుగు కామెడీ పంచ్ లు తప్పా మిగతా అంతా పెద్దగా స్కోప్ లేదు. కథకు ఏది అవసరమో అంతవరకు మాత్రమే పెర్ఫార్మెన్స్ డెలివరీ చేశాడు శివకార్తికేయన్. సోషల్ మీడియా ద్వారా ఈ మూవీకి ఎంతో హైప్ ఇచ్చినప్పటికీ…సగటు ప్రేక్షకుడు మాత్రం అవరేజ్ గానే ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా ఉన్నప్పటికీ…సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే….థియేటర్లో ఒక కొత్త తరహా యాక్షన్ కామెడీ చూడాలి అనుకుంటే మాత్రం వరుణ్ డాక్టర్ పర్ఫెక్ట్ ఛాయిస్. జబర్దస్త్ కామెడీలా కాకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఈ వీకెండ్ కు మంచి కామెడీ ట్రీట్ మెంట్ కావాలంటే వరుణ్ డాక్టర్ ను సంప్రదించవచ్చు.

ఈ సినిమా చూసాక విజయ్ లాంటి టాప్ స్టార్ నెల్సన్ కు ఎలా అవకాశం ఇచ్చాడనే సందేహం కలుగుతుంది.