Sirivennela Sitaramasastry is no moreమధురమైన సాహిత్యానికి మారు పేరు…
సుమధురమైన పాటల చిత్రకారుడు…
సరసంలో ‘వెన్నెల’ స్వరాల సృష్టికర్త…
‘సిరి’లొలికించే చిన్నినవ్వుల చిరుదరహాసుడు…
సిగ్గులేని జనాలను కలంతో నిగ్గదీసే అగ్గి కెరటం…
అర్ధ శతాబ్ధపు అజ్ఞాన స్వాతంత్య్రాన్ని ప్రశ్నించే పౌరుడు…

త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే…
అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు..!
పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరే వీరుడు..!

‘సిరివెన్నెల’ అంటే పేరు కాదు, సుస్వరమైన తెలుగు సాహిత్యానికి నిర్వచనం. ఆయన సాహిత్యాన్ని గానీ, ఆయన వ్యక్తిత్వాన్ని గానీ అభివర్ణించడం అసాధ్యం. బహుశా తెలుగు నిఘంటువు కూడా అక్షరాలు వెతుక్కుంటుందేమో!

ఈ ‘ధరిత్రి’పై కురిపించిన అక్షరాల జల్లు చాలనుకున్నారో లేక తన ‘సిరి’ లాంటి ముత్యాల మాటలు ‘వెన్నెల’పై కూడా కురిపించాలనుకున్నారో గానీ… ఈ ఏకాదశిని దుర్ధినంగా మార్చేసి తనువు చాలించారు.

నిజమే… త్రివిక్రమ్ చెప్పినట్లు…

ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. కానీ ఇపుడు ఆ “అక్షరం” అజరామరం అయిపోవడమే శోకించదగ్గ విషయం.

దివి నుండి భువికెగసిన ‘సిరివెన్నెల’ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… అశ్రునయనాలతో…!