sirish-bharadwaj-second-marriageకొన్నేళ్ల కిందట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆర్య సమాజ్ లో శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో… కొంతకాలం కాపురం తరువాత ఓ బిడ్డను కనడం, ఆపై విభేదాలు వచ్చి విడాకులు తీసుకుని, ఇటీవల శ్రీజ మరొకరిని వివాహం చేసుకోవడం కూడా జరిగిపోయిన సంగతులు తెలిసినవే. అత్యంత ఘనంగా ఈ వివాహ వేడుకను చిరు దగ్గరుండి మరీ జరిపించి, తన వైభవాన్ని చాటుకున్నారు.

అయితే తాజాగా శిరీష్ భరద్వాజ్ కూడా అంతే వైభవంగా తన రెండో వివాహాన్ని జరుపుకుని, చిరు ఫ్యామిలీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను శిరీష్ వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శిరీష్, ఈ వివాహాన్ని గ్రాండ్ గా జరుపుకుని శ్రీజ కుటుంబానికి షాకిచ్చేలా పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం.