Singer Smita political aspirationsతెలుగు సోషల్ మీడియా నిండా జీ తెలుగు ‘సరిగమప’ ప్రోమోలు తెగ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా ఈ షోలో సింగర్ స్మిత చేస్తున్న సాయాల గురించి నెటిజన్లు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. స్మిత మానవత్వానికి, సున్నిత హృదయానికి ప్రతీక అని, మంచితనానికి, సమున్నత వ్యక్తిత్వానికి ఆమె ప్రతిరూపం అని, ఇక కళాభిమానానికి, సమాజసేవకు ఆమె పర్యాయపదం అని ఇలా సాగుతున్నాయి స్మిత పై పొగడ్తల వర్షం.

‘సరిగమప’ షో ఫస్ట్ ఎపిసోడ్ లో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి’ అంటూ గాయని ‘పార్వతి’ తన మధురమైన పాటతో అందరి మనస్సులను గెలుచుకుంది. తన పాటతో పార్వతి ఊరికి ఆర్టీసీ బస్సు వెళ్ళింది. ఈ బస్సు వెనుక సింగర్ స్మిత కృషి ఎంతో ఉంది అని.. ఆమె గురించి మూడు ఎలివేషన్ డైలాగ్స్ తో, ఆరు స్లో మోషన్ షాట్స్ తో మొత్తానికి పార్వతి విషయంలో స్మిత ఫుల్ క్రేజ్ ను కొట్టేసింది.

తాజాగా మరో సింగర్ రసూల్ విషయంలో కూడా తన ఇమేజ్ ని మరో మెట్టు ఎక్కించింది స్మిత. రసూల్ ఒక సాధారణ ఆటో డ్రైవర్. జీవనాధారం కోసం ఆటో డ్రైవర్ గా స్థిరపడ్డాడు. పని చేస్తేనే కడుపు నిండే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పని మానుకుని, తన భార్య కాళ్ళ పట్టీలు అమ్ముకుని రసూల్ కి సరిగమప షోకి వచ్చాడు.

సహజంగా పార్వతి, రసూల్ లాంటి వ్యక్తుల జర్నీ కాస్త ఎమోషనల్ గా ఉంటాయి. సామాన్య జనాల హృదయాలను కదిలిస్తాయి. అయితే, తన మంచితనంతో కదిలిన ఆ హృదయాలను తన వైపుకు తిప్పుకోవడానికి స్మిత ఇలా ప్రతి ఎపిసోడ్ లో ఎవరో ఒకరికి సాయం చేస్తూ హడావిడి చేస్తోంది. మరోపక్క స్మిత ఓవర్ యాక్టింగ్ కి మిగిలిన జడ్జ్ లు అన్ ఈజీగా ఫీల్ అవుతున్నారట.

స్మితకు రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక ఉంది. అందుకే, ఆమె ఇలా తన ఇమేజ్ ను బిల్డ్ చేసుకునే పనిలో పడింది. స్మిత గత కొన్నేళ్లుగా టీడీపీకి ఫాలోవర్ గా ఉంటూ వస్తుంది. టీడీపీకి సపోర్ట్ గా ఎప్పటికప్పుడు ఆమె ట్వీట్స్ చేస్తూ తన మద్దతు తెలుపుతూ ఉంది. కాలం కలిసి వస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున రాజకీయాల్లో ఎమ్మెల్యేగా నిలబడాలని స్మిత ప్లాన్ చేసుకుంటుందట.