singam-3-s3-teaser-public-talk-youtube-hits‘సింగం’ సిరీస్ లలో వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ అందుకుని మూడవ హిట్ కోసం బరిలోకి దిగిన సూర్య, తన తాజా ‘సింగం 3’ టీజర్ ను విడుదల చేసాడు. అయితే ఈ టీజర్ లో సూర్య అరుపులుగా పిలిచే డైలాగ్స్ తప్ప ఏమీ కనపడకపోవడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశ చెందారు. అయితే ఈ సూర్య అరుపులకు కూడా స్పందన అద్భుతంగా రావడం చెప్పుకోదగ్గ విషయం.

విడుదలైన 24 గంటల్లోనే 2 మిలియన్ క్లిక్స్ ను దాటి 3 వైపుకు పరుగులు పెడుతూ సరికొత్త రికార్డులకు చేరువ అయ్యింది. ఇప్పటివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు విజయ్ లకు మాత్రమే ఇలాంటి రికార్డ్స్ ఉండగా, తాజాగా సూర్య అభిమానులు కూడా సత్తా చాటారు. తమిళంతో పాటు తెలుగులో కూడా విశేషమైన అభిమాన గణం సొంతం చేసుకోవడం వల్లనే ఈ రికార్డు వశమైందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.