Silly Fellows Movie Trailer Talkగత కొంతకాలంగా సక్సెస్ కోసం విఫలయత్నం చేస్తోన్న హీరోలలో అల్లరి నరేష్, సునీల్ లు ప్రముఖులు. కామెడీని నమ్ముకున్న ఈ ఇద్దరు చేసినవి అపహాస్యం పాలు కావడంతో, బాక్సాఫీస్ వద్ద పరాజయం ఎదురవుతూ వస్తోంది. అయితే ఈ సారి ఇద్దరూ కలిసి వస్తున్నారు, వస్తూ వస్తూ ప్రిన్స్ మహేష్ బాబు చేత ధియేటిరికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయించుకుని పబ్లిసిటీ కూడా కొట్టేసారు.

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఆశాజనకంగా ఉండడం విశేషం. నరేష్ నటించిన గత కొన్ని సినిమాల ట్రైలర్స్ ను పరిశీలిస్తే… ఇది కాస్త బెటర్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే ట్రైలర్ లో ద్వారా కధపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసారు. ఇద్దరు స్నేహితులు కలిసి చేసే అడ్వెంచర్ కామెడీగా ఈ “సిల్లీ ఫెలోస్” తెరకెక్కిందని స్పష్టం చేసింది.

ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ప్లస్ పాయింట్ ఏమిటంటే… గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు మిస్ అయిన సునీల్ కామెడీ మళ్ళీ బ్యాక్ టు ఫాం అన్న నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించింది. చిత్ర శుక్ల, పూర్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళీ వంటి ప్రధాన తారాగణం కూడా కనిపించగా, శ్రీవసంత్ సంగీతం అందించాడు.